వెన్నుపోటు దినం వైసిపి స్పెషల్ వీడియో…!

-

కూటమి ప్రభుత్వ పాలన ఏర్పడి నేటికీ సంవత్సరం పూర్తయింది. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ టిడిపి పార్టీకి వ్యతిరేకంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసిపి పార్టీ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూటమినేతల హామీల ప్రసంగాలను ఆ వీడియోలో పొందుపరుస్తూ వెన్నుపోటు దినంగా వీడియోను షేర్ చేసుకున్నారు.

jagan, ap, ycp
jagan, ap, ycp

ఎన్నికల అనంతరం గల్లా పెట్టే కాళీ అయిందని చంద్రబాబు నాయుడు పరిస్థితి మరి దారుణంగా ఉందంటూ అచ్చేన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారని ఆ వీడియోలో షేర్ చేసుకున్నారు. కాగా, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఎవరికీ కూడా మంచి చేయలేదని, మంచిది కాదంటూ మాట్లాడారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

 

https://twitter.com/YSRCParty/status/1930133249659154710

Read more RELATED
Recommended to you

Latest news