పోలవరం ప్రాజెక్ట్ పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

-

పోలవరం ప్రాజెక్ట్ పై  వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆంధ్రప్రదేశ్   మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. పోలవరం పై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్ర నిధుల కోసం ఎదురు చూడలేదు. టీడీపీ హయాంలో ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. వైసీపీ ఐదేళ్లలో రూ.4167 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

డయాప్రమ్ వాల్ పై నివేదిక రాకమయుందే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. పోలవరం పై రకరకాల డెడ్ లైన్లు పెట్టారని గుర్తు చేశారు.   పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసిన పాపాలు ఏమైతే ఉన్నాయో సాక్షాలు తెరమరుగు చేశారు. 2019 నుంచి 2024 వరకు కార్యాలయాల్లో ఉన్న ఫైల్లకు కూడా భద్రత లేకుండా పోయింది. పుంగనూరులో ఫైల్స్ ధహనం అయిన విషయం అందరికీ తెలిసిందే అని గుర్తు చేశారు. మా పదవీ కాలం పూర్తి అయ్యేలోపు పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version