అనంతపురం నగరంలో ప్రభుత్వ దుకాణం నుంచి మద్యం బాటిళ్లు తీసుకెళ్తుండగా సురేష్ అనే వ్యక్తిని పట్టుకున్నారు సెబ్ కానిస్టేబుళ్లు. సురేష్ వైసీపీకి చెందిన వ్యక్తి అని సమాచారం. దీంతో వివరాలు తెలుసుకునేందుకు సెబ్ స్టేషన్ కు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సాకే చంద్ర, కమలభూషణ్ వెళ్లారు. ఈ తరుణంలోనే.. సెబ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో వాగ్వివాదానికి వైసీపీ కార్పొరేటర్లు దిగారు. ఎస్ ఐ కూర్చిలో కూర్చొడానికి ప్రయత్నించాడు కార్పొరేటర్ చంద్ర.
అయితే.. ఈ సంఘటనపై చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోంది. అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని విడిచిపెట్టాలంటూ… వైసీపీ ఎమ్మెల్యే రౌడీ అనుచరులు అనంతపురంలోని గుల్జార్ పేట సెబ్ పోలీస్ స్టేషన్ పై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులను చితకబాదడాన్ని… మహిళా పోలీస్ డ్రెస్ లాగుతూ పీఎన్ నుంచి బయటకు ఈడ్చుకెళ్లడాన్ని పాలకులు కానీ, పాలకులకు కొమ్ము కాస్తున్న పోలీసు పెద్దలు కానీ ఎలా సమర్ధించుకుంటారు? అని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఈ దాడిలో వైసీపీ రౌడీలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం ఇంకా దారుణం. ఒక నేరగాడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు ఇలాంటి నేరస్తుల పహారాలో భయం భయంగా బతకాల్సి వస్తోందన్నారు బాబు.