మీరు కూడా బస్సు ఛార్జీలు పెంచండి.. ఏపీఎస్ఆర్టీసీని కోరిన టిఎస్ఆర్టిసి

-

టిఎస్ఆర్టిసి డీజిల్ సెస్ పేరిట రెండోసారి బస్ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఏపీ -తెలంగాణ మధ్య తిరిగే ఏపీఎస్ఆర్టీసీ సర్వీసుల్లోనూ ఈ మేరకు చార్జీలు పెంచాలంటూ ప్రతిపాదించింది టిఎస్ఆర్టిసి. ఈనెల 9న టిఎస్ ఆర్టిసి డీజిల్ సెస్ పేరిట చార్జీలు పెంచింది. దీనివల్ల తెలంగాణ- ఏపీ మధ్య తిరిగే టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో ఎక్కువ చార్జీ ఉండగా.. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసుల్లో తక్కువగా ఉంది.

అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల్లో ఒకేవిధమైన చార్జీలు ఉండాలి. ఈ మేరకు తెలంగాణకు ఏపీఎస్ఆర్టీసీ నడిపే సర్వీసుల్లో సైతం చార్జీలు పెంచాలని టిఎస్ఆర్టిసి కోరింది. దీనిపై ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం చురుకుగా పరిశీలిస్తుంది. పెంచిన బస్ చార్జీలతో టీఎస్ఆర్టీసీ కి రోజుకు సగటున రూ.4-5 లక్షల అదనపు ఆదాయం వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news