వివేకా హత్యకేసులో సీబీఐ అనుబంధ ఛార్జ్​షీట్.. A-8గా ఎంపీ అవినాష్

-

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ కోర్టుకు అధికారులు సీబీఐ అనుబంధ ఛార్జ్​షీట్ సమర్పించారు. ఇందులో ఎ-6గా ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎ-7గా వై.ఎస్‌.భాస్కరరెడ్డి, ఎ-8గా వై.ఎస్‌.అవినాష్‌ రెడ్డిలను పేర్కొంది. వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్‌లను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది. జూన్‌ 30లోగా వివేకా హత్యకేసులో దర్యాప్తును పూర్తిచేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. ఇప్పటివరకూ నమోదుచేసిన సాక్షుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను జత చేసింది.

సీబీఐ సమర్పించిన ఆధారాలనూ పరిశీలించిన తర్వాత కోర్టు యంత్రాంగం న్యాయమూర్తి ముందు ఉంచుతుంది. అభియోగపత్రాన్ని, అందులో పేర్కొన్న అభియోగాలను, ఆధారాలను పరిశీలించాక న్యాయమూర్తి దాన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుని నిందితులకు సమన్లు జారీ చేయాల్సి ఉంది.

మరోవైపు ఈ కేసులో నిందితులైన గంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కరరెడ్డిలను చంచల్‌గూడ జైలునుంచి తీసుకొచ్చి శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచారు. వీరందరికీ జడ్జి సీహెచ్‌.రమేశ్‌బాబు జులై 14 వరకు రిమాండును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news