తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలుసుకోనున్నారు. నేడు కంకిపాడుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు పయనం కానున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా తనయుడి వివాహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.

సీఎంలు అయ్యాక ఇద్దరూ ఒకేచోట కలిసే తరుణానికి కంకిపాడు వేదిక కానుంది. కాగా ఇవాళ ఉదయం 9.15కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి, 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఉదయం 10.50 నుంచి 11.30 వరకు జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దేవినేని ఉమా, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కుమారుని వివాహానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.