పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై ys షర్మిల పోస్ట్ పెట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని.. సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని చెప్పారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు.
ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి మృతి పై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ys షర్మిల. నిజాలు నిగ్గు తేల్చాలి. ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న అని పేర్కొన్నారు.