ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవ్వాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య ఇవాళ ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్…. జియో హాట్స్టార్ లో ఉచితంగా ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ మొదటి బ్యాటింగ్ చేస్తే…. 300 కొట్టడం పక్క అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
గతంలో కూడా లక్నోకు చుక్కలు చూపించింది హైదరాబాద్. గత ఏడాది హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంతో kl రాహుల్ను బండబూతులు తిట్టాడు లక్నో ఓనర్ సంజీవ్. ఇక ఇవాళ మరోసారి ఈ రెండు జట్లు తల పడబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే హైదరాబాద్ ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
- నేడు హైదరాబాద్ వేదికగా SRH vs LSG ఐపీఎల్ మ్యాచ్
- రాజీవ్ గాంధీ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్
- పోటాపోటీగా తలపడనున్న హైదరాబాద్, లక్నో జట్లు
- టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు నాలుగు మ్యాచుల్లో తలపడగా.. లక్నో 3, హైదరాబాద్ 1 గెలిచాయి