ప్రధాని మోదీని దూషించి కాంగ్రెస్ గెలవలేదు – అమిత్ షా

-

ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రధాని మోదీ ఓ విష సర్పం లాంటి వ్యక్తి అని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. కర్ణాటకలోని నవల్ గుండ్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. ప్రపంచమంతా ప్రధాని మోదీని అభినందించి గౌరవిస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయనని అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు.

ఖర్గే మోదీని విష సర్పం అన్నారని.. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే మోదీ వారు ఎంత దూషిస్తే అందుకు రెట్టింపుగా మోడీ ప్రకాశిస్తారని అన్నారు. ప్రధాని మోదీని దూషించిన కాంగ్రెస్ గెలవలేదని అన్నారు అమిత్ షా. గత తొమ్మిదేళ్లలో నరేంద్ర మోడీ ప్రపంచంలో భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచారని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Exit mobile version