విజయసాయిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఎంపీ సీటు అమ్ముకున్నాడు !

-

విజయసాయిపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారు. ప్రలోభాలకు లోనై రాజ్యసభ సీటును అమ్మేశారు. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్‌మెంట్లకు విలువ ఉంటుందా? ’ అని వ్యాఖ్యానించారు.

YSRCP chief YS Jagan made sensational comments on Jayasai Reddy
YSRCP chief YS Jagan made sensational comments on Jayasai Reddy

మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. నారా లోకేష్ స్నేహితుడి కంపెనీ ఊర్సా అనే సంస్థకు విశాఖపట్టణంలో కేవలం ఒక్క రూపాయికే ఎకరం భూమిని ఇస్తున్నారని ఆవుపానాలు చేశారు. రూ.2000 కోట్లు విలువ చేసే భూమిని ఎలాంటి టెండర్లు లేకుండా లులు మాల్ కు ఉచితంగా కేటాయించారన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

కేసీఆర్ గారు 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారన్నారు. చంద్రబాబు నాయుడు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి ? ఎందుకు అంత భూమి ? అన్నారు వైఎస్ జగన్. అమరావతి పనుల కోసం 2018లో టెండర్లు పిలిచామన్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news