24 గంటల్లో రైతుల ఖాతాల్లో బకాయిలు జమ – మంత్రి నాదెండ్ల

-

ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెం డ్ల మనోహర్. రైతులకు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.672 కోట్లు విడుదలకు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్.

nadendla-manohar
Civil Supplies Minister Nadendla Manohar gives good news to AP farmers

దాదాపు 30988 మంది రైతులకు ఈ నిధులు మంజూరు ద్వారా లబ్ది చేకూరనున్నట్లు వెల్లడించారు. 24గంటల్లో రైతుల ఖాతాల్లో బకాయిలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక అటు ఏపీ కేబినెట్ మీటింగ్..ముగిసింది. ఈ సందర్బంగా 12 అంశాలపై చర్చించింది ఏపీ మంత్రివర్గం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ చూస్తోందని ప్రస్తావించారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతినేలా వివిధ సంస్థలకు ఈ మెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news