YSRCP leaders distributing milk packets and water bottles : విజయవాడ వరద బాధితుల కోసం రంగంలోకి దిగింది వైసీపీ పార్టీ. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వరద బాధితులకి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్‌ను పంపిణీ చేస్తున్నారు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు.

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా ఈ రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు లక్ష పాల ప్యాకెట్లు, రెండు లక్షల వాటర్ బాటిళ్లను నింపిన ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీలను ఈ రోజు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండీ రూహుళ్ల , కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు, వైసీపీ కార్పొరేటర్లు, ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.