ఫ్యాన్ స్ట్రాటజీ..పవన్‌ని బాబుకు దూరం చేయాల్సిందే..!

-

ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాల దూకుడు పెరుగుతుంది.. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ…అధికార వైసీపీకి ధీటుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే..నిత్యం ఏదొక విధంగా వైసీపీపై విమర్శలు చేస్తూనే ఉంది…వైసీపీ తీసుకునే నిర్ణయాలని వ్యతిరేకిస్తూ ఉంది..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. అదే సమయంలో అటు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన సైతం దూకుడుగానే రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ఆ పార్టీ కూడా జగన్ ప్రభుత్వం టార్గెట్‌గానే రాజకీయం చేస్తుంది..ఇటీవల భీమ్లానాయక్ సినిమా విషయంలో వైసీపీ, జనసేనల మధ్య వార్ నడిచిన విషయం తెలిసిందే.

ఇక పవన్‌కు టీడీపీ కూడా మద్ధతుగా నిలుస్తుంది..ఇలా టీడీపీ-జనసేనలు కలిసి వైసీపీ టార్గెట్‌గా ముందుకెళుతున్నాయి..ఇదే క్రమంలో టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాయని ప్రచారం జరుగుతుంది..ఇప్పటికే ఆ రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. అటు వైపు నుంచి చంద్రబాబు పొత్తు విషయంలో బాగా సానుకూలంగా ఉన్నారు…పవన్‌తో కలిసి నెక్స్ట్ ఎన్నికలకు వెళితేనే బెనిఫిట్ ఉంటుందనే విషయం బాబుకు తెలుసు.
ఎందుకంటే పవన్ విడిగా పోటీ చేస్తే ఏం అవుతుందో..గత ఎన్నికల్లో అర్ధమైంది..జనసేన ఓట్లు చీల్చేసి టీడీపీకి డ్యామేజ్ చేసింది. అందుకే ఈ సారి కలిసి పోటీ చేస్తేనే బెటర్ అని బాబు చూస్తున్నారు. అటు పవన్ కూడా అదే దిశలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే పొత్తు ఇప్పుడే ఫిక్స్ కాకపోవచ్చు..ఎన్నికల ముందే పొత్తు సెట్ అయ్యేలా ఉంది.

అయితే బాబు-పవన్ కలిస్తే జగన్‌కు ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు…అందుకే వారు కలవకుండా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది..తాజాగా కొడాలి నాని కూడా ఈ పొత్తుని విడదీయడానికే ప్రయత్నించినట్లు కనిపించింది…పవన్‌ని వాడుకుని బాబు లాభపడాలని చూస్తున్నారని అంటున్నారు. ఆ విషయం పవన్ తెలుసుకోవాలని కోరుతున్నారు…అంటే పవన్, బాబుతో కలవకుండా ముందే విడగొట్టే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version