ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఉద్యోగులకు పండగే.. !

-

ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతున్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది.. కరోనాకు ముందు దాదాపు అన్ని సంస్దల పని దినాలు ఒకే విధంగా ఉండేవి, ఎప్పుడైతే కరోనా ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టిందో అప్పటినుండి అన్ని ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి.. తర్వాత లాక్‌డౌన్ గడువు ముగిసింది.. అయినా కరోనా వ్యాప్తి ఆగడం లేదు.

ఇకపోతే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చినప్పుడు ఉద్యోగులకు మొదట వారానికి ఐదురోజులు పనిచేయాలనే ఆఫర్‌ను ఇచ్చారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక వారానికి ఐదు రోజుల పని దినాలను ఏడాది పాటు పొడగించారు. ఆ గడువు ఈ నెల 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించి ఈ ఆప్షన్‌ను కొనసాగించాలా వద్దా అని చర్చించారు. చివరికి ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు..

 

ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలను ఏడాదిపాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే ఈ ఉత్తర్వులు సచివాలయ ఉద్యోగులతో పాటుగా, అన్ని శాఖాల హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని ఆమె వెల్లడించారు. కాగా ఈ ఆప్షన్‌ను పొడగించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు మరో ఏడాది పాటు తీపి కబురు అందినట్టయింది..

Read more RELATED
Recommended to you

Latest news