ఏపీలో అసెంబ్లీలో మరికొద్దిసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024-25 సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సోమవారం ఉదయం సమావేశమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూపొందించిన 2024-25 బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అంతకుముందు అమరావతిలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళ్లు అర్పించారు. మరికాసేపట్లో సమావేశాలు ప్రారంభం కానుండటంతో కూటమికి చెందిన శాసనసభ్యులంతా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కాగా, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం అసెంబ్లీకి రానని ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే.