ఓయో రూములో లవర్ ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం!

-

హైదరాబాద్ మహానగరంలోని రామంతాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రియురాలితో కలిసి ఓయో రూములో గడిపిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకివెళితే.. రామంతాపూర్‌ ప్రగతి నగర్‌లోని ఓయో రూములో ఆదివారం రాత్రి సౌమ్య, ఓంకార్ అనే ప్రేమ జంట దిగారు.

తెల్లవారు జామున ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి గురించే జరిగిందా? లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? తెలీదు. ఈ క్రమంలోనే సౌమ్య వెళ్లిపోయాక ఓంకార్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండగా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news