సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వారం కిందటే మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. అనుకోకుండా అక్టోబర్ 9న పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది. అప్పుడు తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలను ఈ భేటీలో ముందుగా చర్చించనున్నట్లు సమాచారం. ముందుగా రాష్ట్రంలో గత ప్రభుత్వం విధించిన చెత్త పన్ను రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఆ తర్వాత వరద ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీ మేరకు వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా నూతన పారిశ్రామిక విధానంపై ప్రధాన చర్చ.. జాబ్ ఫస్ట్ అనే లక్ష్యంతో పాలసీలను ఓకే చేయనున్నారు.వీటితో పాటే పారిశ్రామిక అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు వంటి పాలసీలు కేబినెట్‌లో చర్చకు రానున్నాయి. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీపై కూడా కేబినెట్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.