మీకు తీరని కోరికలు ఉన్నాయా? అక్కడ ఒక అరటి గెల కడితే వెంటనే తీరతాయట..

-

సాదారణంగా గుడికి వెళ్ళే భక్తులు పండు, పూలు, ప్రసాదం తీసుకొని వెళ్తారు..కానీ ఓ గుడికి వెళ్ళే భక్తులు మాత్రం ఏకంగా అరటి గెలలు తీసుకొని వెళ్తారు.. స్వామి వారికి భక్తితో మొక్కితే కోరిన కోరికలు తీరతాయి. దాంతో భక్తులు అరటి గెలను కడతారు..నిజంగా వింతగా ఉందే.. ఇదంతా అబద్దం అని కొట్టి పారెయ్యకండి..ఇది నిజం.. అసలు ఆ గుడి ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.ఈ ఆలయంలో గత 80 ఏళ్ల నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, చెట్లతాండ్ర గ్రామంలో లక్ష్మీనృసింహ స్వామి కొలువయ్యారు. ఉద్యోగం కావాలన్నా.. పెళ్లి జరగాలన్న.. పిల్లలు కలగాలన్న ఇలా భక్తులు కోరిన కోర్కేలు తీరాలంటే ఒక్క అరటి గెలచాలు.. కోర్కెలు ఇట్టే తీరిపోతాయని భక్తులు నమ్మకం. ఎక్కడైనా దేవుడికి అరటి పళ్లు పెట్టడం సాధారణమే అయినా ఇక్కడ ఏకంగా గెలకు గెలే పెడతారు. అందుకే ఆలయ ప్రాంగణమంతా అరటి సువాసనలతో నిండిపోతుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మొదటగా ఈ అరటి గెలలే కనువిందు చేస్తాయి.

లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న రావి చెట్టు పక్కన వేసిన పందిర్లకు అరటి గెలలు కడితే కోరిన కొర్కేలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి స్వామికి అరటి గెలలు కడుతుంటారు. చెట్లతాండ్ర ఓ సాదాసీదా గ్రామం. కానీ ఇక్కడున్న ఆలయంతో ఈ గ్రామం ఫేమస్ అయిపోయింది. 170 ఏళ్ల కిందట ఈ గ్రామానికి వచ్చిన స్వామీజీ పేరే పరవస్తు అయ్యవారు. అరటి గెలల సంప్రదాయానికి మూల కారణం ఆయనే..భీష్మ ఏకాదశి ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.భీష్మ ఏకాదశి రోజున ఏకంగా భక్తులు 8వేల గెలలు కట్టారంటే ఏ స్థాయిలో అక్కడికి తరలివస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇందులో ఒక్క అరటి గెల కూడా మిస్ కాదు.కొందరు మూడు రోజుల తర్వాత ఈ అరటి గెలలు స్వామి ప్రసాదంగా భావించి తీసుకెళ్తుంటారు..ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు..వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి గెలలు కడతారు.. పర్యాటకుల కోసం మరిన్ని వసతులు మార్చితే ఇంకా ప్రసిద్ధి చెందుతుందని అక్కడ ప్రజలు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version