మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించడంతో ఆయన రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. 100 కోట్ల వసూళ్ళకు పాల్పడినట్టు దేశ్ ముఖ్ మీద ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కొద్ది సేపటి క్రితం సీఎం ఉద్ధవ్ కు రాజీనామా లేఖ పంపినట్టు తెలుస్తోంది. నిజానికి ముందు నుండి ఆయన రాజీనామా చేయాలని విపక్ష పార్టీలు ఒత్తిడి చేస్తున్నాయి.
.అయితే సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించడంతో అనిల్ మీద ఒత్తిడి పెరిగినట్టు చెబుతున్నారు..15 రోజుల్లో విచారణ చేపట్టాలని సీబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక నెలకు 100 కోట్ల వసూళ్లు టార్గెట్ పెట్టినట్టు హోం మంత్రి మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. హోంమంత్రి అవినీతి మీద విచారణ జరపాలని హైకోర్టును ముంబై మాజీ సీపీ ఆశ్రయించిన నేపధ్యంలో విచారణ జరిపిన కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.