అనిల్ రావిపూడి: అసూయతో నాపై కుట్ర చేస్తున్నారు..!!

ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 హిట్ కొట్టినా చాలా రోజుల నుండి ఖాళీగా ఉన్నాడు. తన సినిమా కు స్క్రిప్ట్ వర్క్ మొత్తం తానే చూసుకొనే అనిల్ సినిమాను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తాడు. అనిల్ రావిపూడి కు బాలయ్య ఎప్పుడో సినిమా కోసం మాట ఇచ్చాడు.గోపీచంద్ మలినేని సినిమా పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి బాలయ్య కోసం తన జోనర్ అయిన కామిడీ ని వదిలి పెట్టి షాకింగ్ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇది బాలయ్య బాబును శక్తివంతంగా చూపించే కథ అని అంటున్నారు.

ఇదిలా ఉండగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో తనను కావాలని కొందరు టార్గెట్ చేసి తన పట్ల నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాని కొనుగోలు చేసిన బయర్లు పెద్ద ఎత్తున నష్టపోయారంటూ వార్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వరస హిట్స్ వచ్చాయి అన్న అసూయ తోనే నాపై కుట్ర చేస్తున్నారని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి