యానిమ‌ల్ నాకు తెగ నచ్చేసింది : హ్యూమా ఖురేషీ

-

బాలీవుడ్ న‌టి హ్యూమా ఖురేషీ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవసరం లేదు. గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్ మూవీతో ఇండ‌స్ట్రీలోకి అరంగేట్రం చేసి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ యానిమ‌ల్ మూవీ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.ఈ చిత్రం గురించి హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా న‌చ్చింది. ఈ సినిమాలో యాక్షన్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ఇలాంటి చిత్రంలో తాను కూడా నటించాలని అనుకుంటున్నా. ఒక నటిగా అన్ని ర‌కాల చిత్రాలు చేయాలి. అయితే ఆ మూవీస్ చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం. సినిమా అన్నాక ప్ర‌శంస‌ల‌తో పాటు విమర్శలు కూడా వ‌స్తుంటాయి. అంటూ హ్యూమా చెప్పుకొచ్చింది. కాగా ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది. బాబి డియోల్, అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం 900 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news