నాగార్జునసాగర్ డ్యామ్ పరిశీలించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ

-

కృష్ణాయాజమాన్య బోర్డు పరిధిలోకి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వెళ్తోందని ప్రచారం సాగుతున్న తరుణంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ- (NDSA) నిపుణుల బృందం ప్రాజెక్టును తనిఖీ చేస్తోంది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు రాకేశ్‌ కశ్యప్ నేతృత్వంలోని బృందంలో ఎన్‌డీఎస్ఏ నుంచి ముగ్గురు, కేంద్ర జలసంఘం, కృష్ణా నది యాజమాన్య బోర్డుతోపాటు రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిదిమంది సభ్యులు తనిఖీలు చేస్తున్నారు.

సాగర్ స్పిల్ వేలో కాంక్రీట్ పని, సీఫేజ్‌ గుంతలకి మరమ్మతులు, కుడికాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లకు మరమ్మతులు, పూడికను బయటకు పంపే గేటు మార్పిడి వంటి పనులు చేయాలని.ఇప్పటికే కేఆర్ఎంబీ గుర్తించింది. అలాగే ఎడమకాల్వ తూముల ముందరకాల్వలో పూడిక పేరుకుంది. నీరు విడుదల చేసినప్పుడు వేగంగా వెళ్లట్లేదు ఆ పనులు చేయాల్సి ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరదలు వచ్చినప్పుడు సాగర్ నుంచి ఆ నీటిని ఏకకాలంలో విడుదల చేసేందుకుగాను మరో స్పిల్‌వే అవసరమని గతంలో నిపుణుల కమిటీ గుర్తించింది. ఆ అంశం క్షేత్రస్థాయి తనిఖీల్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news