జైలర్” మూవీలో అనిరుద్ మ్యూజిక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ !

-

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ ఈ రోజు థియేటర్ లలో రిలీజ్ అయింది. ఇందులో జైలర్ గా రజినీకాంత్ నటించిన ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ ఏంటో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు. ఇక రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా చేసింది. ఇంకా పూర్తి రివ్యూ రావాల్సి ఉండగా సినిమా గురించి ఒక కీలక విషయం వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన అనిరుద్ రవిచందర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారట, ఇతను అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ కాగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్ లో ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనిరుద్ రవిచందర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇక అనిరుద్ రవిచందర్ చిన్న వయసులోనే అద్భుతంగా మ్యూజిక్ చేస్తూ తన మార్క్ ఏమిటో సినీ పరిశ్రమకు రుచి చూపిస్తున్నాడు. ఇక తెలుగు సినిమా దర్శక నిర్మాతలు సైతం అనిరుద్ డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news