షర్మిల రెడీ..సీటుపై డౌట్..కాంగ్రెస్‌కు మైనస్సేనా?

-

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయడానికి వైఎస్ షర్మిల రెడీ అయిపోయారు. మరికొన్ని రోజుల్లోనే విలీన ప్రక్రియ ముగియనుంది. ఇక తన తండ్రి వైఎస్సార్ ఆఖరికి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల పనిచేయనున్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగనున్నారు.  అయితే కాంగ్రెస్ నుంచి దూరమై జగన్ వైసీపీ పెట్టి ఏపీ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. అక్కడ అధికారంలో ఉన్నారు.

అయితే మొన్నటివరకు షర్మిల..తన అన్న పార్టీ కోసం పనిచేశారు. ఇక తాను తెలంగాణ కోడలుని అని, తెలంగాణకు వైఎస్సార్ ఎంతో చేశారని, ఇక్కడ కూడా రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకుంటానని పాదయాత్ర చేశారు. కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చారు. అయితే ఎన్ని చేసిన షర్మిల పార్టీ సంస్థాగతంగా బలపడలేదు. ఇదే క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది. దీంతో పోటీ బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య ఉండనుంది. బి‌జే‌పి కొన్ని చోట్ల పోటీ ఇస్తుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో సొంతంగా పార్టీతో ముందుకెళితే ఉపయోగం ఉండదు. ఈ క్రమంలో ఆమె..కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు రెడీ అయ్యారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయని, కాకపోతే షర్మిల పోటీ చేసే సీటుపై క్లారిటీ రావాలి. ఆమె పాలేరు సీటు ఆశిస్తున్నారు. అటు సికింద్రాబాద్ సీటు ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది.

అలాగే కాంగ్రెస్ లో తన పోస్ట్ ఏంటి అనే అంశంపై షర్మిల చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇవి తేలితే..ఆమె కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఖాయం. ఈ నెలాఖరు లోపు షర్మిల..కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఖాయమని తేలింది. అయితే షర్మిల రావడం వల్ల కాంగ్రెస్‌కు లాభమేనా అంటే..చాలా తక్కువ శాతం లాభం ఉండవచ్చు. కానీ అధికార బి‌ఆర్‌ఎస్‌కు ఆయుధం దొరికినట్లే..ఆంధ్రా వాళ్ళ పెత్తనం వస్తుందని ప్రచారం చేయవచ్చు. చూడాలి మరి షర్మిల..కాంగ్రెస్‌లోకి వెళితే ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news