నేటి కాలంలో స్త్రీలు అక్రమ సంబంధాల బాట పడుతున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్తను, పిల్లలను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి కన్న కూతురు అడ్డుగా ఉందని మూడేళ్ల కూతురిని చంపేసింది ఓ తల్లి. అంజలి అనే మహిళ తన భర్తను వదిలేసి అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడితో కలిసి ఉంటుంది.

కూతురి అడ్డు తొలగించాలని ప్రియుడు అలోకేష్ తరచుగా వేధిస్తుండడంతో ఆమె విసిగిపోయి బిడ్డను చంపాలని నిర్ణయం తీసుకుంది. పాపను పడుకోబెట్టి సరస్సులోకి తోసేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చి కన్నీరు పెట్టుకుంది. విషయం గురించి పోలీసులకు సమాచారం అందించగా అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అంజలిని ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. తన కూతురిని చంపేందుకు వెళ్తున్న సమయంలో సీసీ కెమెరాలో వీడియో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన చాలా మంది కన్నీరు పెట్టుకుంటున్నారు. అంజని వదిలిపెట్టకూడదని ఫైర్ అవుతున్నారు. ఆ మహిళకు కఠినమైన శిక్షను వేయాలని పోలీసులను కోరుతున్నారు.