ANNAATTHE : స్టైలిష్ లుక్ లో రజినీ : “అన్నాత్తే” నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్..

-

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా ను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుoడగా… సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కుష్బూ, మీనా మరియు యంగ్ హీరో కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. వినాయక చవితి సందర్భంగా విడుదలైన… అన్నాత్తే ఫస్ట్ లుక్ అందరినీ అలరించింది.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్… పేరుతో… టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. అన్నాత్తే… అన్నాత్తే అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటలో.. పంచ కట్టు లో కనిపించి అందరినీ అలరించాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఎప్పటిలాగే తన స్టైల్ మరియు ఫార్మెన్స్ ను కనపరిచాడు రజినీకాంత్. కాగా ఈ సినిమా నవంబర్ 4వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news