annadata sukhibhava scheme: అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. త్వరలో వారి అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. కొన్ని కారణాలతో “అన్నదాత సుఖీభవ” పథకం కింద సాయం అందని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రీవెన్స్ ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు 10,915 దరఖాస్తులు వచ్చాయి.

అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 1,290 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్నారు. గ్రీవెన్స్ లో సమస్య పరిష్కారమై పథకానికి అర్హులైన వారికి త్వరలోనే నగదు జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.