నేతన్నలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. నేతన్నలకు 90 శాతం సబ్సిడీతో ఉపకరణాలు అందజేస్తోంది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. ఈ మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ల మంత్రి సవిత ప్రకటన చేశారు. నేతన్న కుటుంబానికి నెలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

చేనేత ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ తో కూడిన వీవర్ కార్డు అందిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా చేనేత వస్త్రాలు రెడీ చేస్తున్నట్లు వెల్లడించారు. చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ప్రకారం ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేసారు మంత్రి సవిత. ప్రజల్లో కూడా చేనేత వాడకంపై మమకారం పెరుగుతుందని… నేతన్నలకు 90 శాతం సబ్సిడీతో ఉపకరణాలు అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు.