విశాఖ కానిస్టేబుల్ హత్య కేసులో కీలక ట్విస్ట్ !

-

విశాఖ కానిస్టేబుల్ ను భార్య అతి దారుణంగా ప్రియుడు తో అక్రమ సంబంధానికి బానిసగా మారి భర్తను పక్కా ప్లాన్ ప్రకారం చంపిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచనలనంగా మారింది. భార్య అతిగా నటించినందుకు అనుమానంతో పోలీసులకు చెప్పగా మొత్తం బాగోతం బయటపడింది. ఇప్పటి వరకు భార్య శివాని, ప్రియుడు డ్రైవర్ రామారావు మరియు అతనికి సహకరించిన అతని ఫ్రెండ్ లను వరుసగా A1, A2 , A3 లుగా ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఈ కేసును విచారిస్తున్న సమయంలో మరో ఆసక్తికరమైన అంశం పోలీసులకు తెలిసింది. శివాని అక్క పైడమ్మ కు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకంటే శివాని కాల్ రికార్డ్స్ ను పరిశీలిస్తే చాలా సార్లు శివాని, రామారావు మరియు పైడమ్మ లు కాంఫరెన్సు కాల్ లో మాట్లాడుకున్నట్లు తెలిసిందట.

దీనితో పైడమ్మను సైతం ఈ కేసులో A4 గా చేర్చనున్నట్లు తెలుస్తోంది. కానీ పైడమ్మ మాత్రం పోలీసుల విచారణలో నాకు రామారావు ని శివాని ఫ్రెండ్ ని పరిచయం చేసింది.. అంతే కానీ ఈ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version