హైద‌రాబాద్‌కు మ‌రో ఇంట‌ర్నేషన‌ల్ కంపెనీ.. కేటీఆర్ ట్వీట్

-

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌కు మ‌రో ఇంట‌ర్నేషన‌ల్ కంపెనీ వ‌స్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న బాష్ సంస్థ హైద‌రాబాద్ లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో బాష్ సంస్థ ప్ర‌తినిధులు ఒప్ప‌దం చేసుకున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ట‌ర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. బాష్ సంస్థ ద్వారా తెలంగాణలో దాదాపు 3,000 ఉద్యోగాలు వ‌స్తాయ‌ని తెలిపారు.

అయితే బాష్ గ్లోబ‌ల్ సాఫ్ట్ వేర్ టెక్నాల‌జీస్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ కోసం హైద‌రాబాద్ ను ఎంచుకున్నార‌ని అన్నారు. కాగ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర ప్ర‌భుత్వం గాలికి విడిచి పెట్టింద‌ని ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా బీజేపీ పై విమ‌ర్శలు గుప్పించారు. కేంద్ర సాయం లేకున్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డంలో త‌మ ప్ర‌భుత్వం ముందు ఉంద‌ని ట్వీట్ట‌ర్ లో కిషన్ రెడ్డికి కౌంట‌ర్ గా విమ‌ర్శించారు. దాన్ని నిజం చేస్తు ఇప్ప‌టి కే రాష్ట్రానికి ప‌లు ప్ర‌యివేటు కంపెనీలు తీసుకువ‌చ్చిన కేటీఆర్ ఇప్పుడు మ‌రో కంపెనీ వ‌స్తుంద‌ని ట్వీట్ట‌ర్ లో ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news