కరోనా మహమ్మారి చాలా మంది ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. ఈ మహమ్మారి బారిన పడి రీసెంట్ గా ప్రముఖ గాయని నైటింగేల్ ఆఫ్ ఇండియా లతామంగేష్కర్ కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు లతా మంగేష్కర్ పార్థివదేహానికి నివాళ్లు అర్పించారు. అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా నివాళ్లు అర్పించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
లతా మంగేష్కర్ తన జీవితంలో పెళ్లికి దూరంగా ఉన్నారు. ఎవరినీ పెళ్లి చేసుకోకపోవడంతో లతామంగేష్కర్ కు వారసులు అంటూ లేరు. కానీ ఆమె పేరిట 200 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లతామంగేష్కర్ వీలునామా ఎవరి పేరిట రాశారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే లతా మంగేష్కర్ కు ఓ ట్రస్ట్ ఉందట.
దాంతో ఆస్తులు ఆ ట్రస్ట్ పేరిట రాశారా అన్నఅనుమానాలు మొదలయ్యాయి. లేదంటే ఆమె తన తోబుట్టువులకు ఎమైనా రాసి ఇచ్చారా అన్నది కూడా తెలియాల్సింది. ఇక దీనిపై త్వరలోనే ఆమె లాయర్ అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే లతా మంగేష్కర్ కు ఇద్దరు చెల్లెల్లు ఓ తమ్ముడు ఉన్నారు. లతా మంగేష్కర్ చిన్న వయసులోనే ఆమె తండ్రి టాలెంట్ ను గుర్తించారు.
సంగీతంలో శిక్షణ ఇప్పించారు. దాంతో స్కూల్ లో సైతం లతా మంగేష్కర్ తన స్నేహితులకు పాటలు నేర్పించడం మొదలు పెట్టింది. స్కూల్ యాజమాన్యం పాటలు నేర్పుతుంది అనే కారణంతో ఆమెను డిస్మిస్ చేశారట. అంతే కాకుండా లతా మంగేష్కర్ సోదరిని కూడా పాటలు పాడుతుందనే కారణంతో స్కూల్ నుండి డిస్మిస్ చేశారట.