జబర్దస్త్ లో మరో లవ్ ట్రాక్..

-

తెలుగు టెలివిజన్ తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ ప్రోగ్రామ్ జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, అనసూయ, రష్మీ మొదలగు వారందరూ ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. జబర్దస్త్ స్టేజిపై సుడిగాలి సుధీర్, రష్మీల లవ్ ట్రాక్ బాగా పండుతుంది. బయట కూడా ఈ జంటకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే తాజాగా జబర్దస్త్ నుండి మరో లవ్ ట్రాక్ తెరపైకి వస్తుంది.

జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య ఈ ట్రాక్ నడుస్తుందని తెలుస్తుంది. డిసెంబర్ 11 వ తేదీన ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య చిన్న లవ్ ట్రాక్ రివీల్ కానుంది. అటు వర్ష, ఇటు ఇమ్మాన్యుయేల్.. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ అందరికీ దొరికిపోయారు. నల్లగా ఉన్నా ఏమవుతుంది మనసు బాగుండాలని ఇమ్మాన్యుయేల్ గురించి చెప్పడంతో అందరిలో ఆసక్తి కలిగింది. ఈ మధ్య ఘాటు ఘాటు ఫోటోషూట్లతో రెచ్చిపోయిన వర్ష, ఈ సారి ఇమ్మాన్యుయేల్ తో లవ్ విషయంలో చర్చల్లోకి వచ్చింది. మరి వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ఈ ట్రాక్, ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news