ఢిల్లీ సమీపంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం

-

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. నోయిడా (యూపీ) శివార్లలో దేశంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి నేడు ప్రధాని మోడీ శంఖుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం గం. 1.00కు శంఖుస్థాపన చేయనున్న ప్రధాని… రూ. 10,500 కోట్లతో మొదటి దశ విమానాశ్రయ నిర్మాణంగా రికార్డు సృష్టించినుంది. ప్రాజెక్టు అన్ని దశలు పూర్తిచేసుకునే సరికి రూ. 35 వేల కోట్ల ఖర్చు కానుంది. నోయిడా నుంచి 40 కి.మీ దూరంలో, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 72 కి.మీ దూరంలో ఏర్పాటు కానుంది. 1,300 హెక్టార్ల విస్తీర్ణంలో నోయిడా ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కానుంది.

2024 నాటికి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఏడాదికి 1.2 కోట్ల ప్రయాణికుల తాకిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 20 లక్షల మెట్రిక్ టన్నుల సరకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయనుంది. భవిష్యత్తులో 80 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఆగ్రా, ఫరీదాబాద్, మథుర నగరాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుంది. ఢిల్లీ-ఐజీఐ విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గిస్తుందని అంచనా వేస్తోంది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news