బాలీవుడ్ లో త్వరలో మరో మెగా మల్టీస్టారర్…!

-

బాలీవుడ్ దిగ్గజ హీరోలకు సరైన హిట్ లేక మల్టీస్టారర్ తో మాయ చేయాలని చూస్తున్నారు.బాలీవుడ్ మల్టీస్టారర్ ఫిలింస్ కు పెట్టింది పేరు. అందరు అందరితో చేస్తారుగాని కొందరు మాత్రం కొందరితో కలవడానికి ఎందకనో తటపటాయిస్తుంటారు.వారిలో కండలవీరుడికి ఆల్ రెడీ హిట్స్ ఉన్నాయి.కాకపోతే కింగ్ ఖాన్ కే హిట్ పడి చాలా గ్యాప్ వచ్చేసింది.ఆ గ్యాప్ ను పూడ్చడానికో లేక స్టోరీ డిమాండో తెలియదుగాని మొత్తానికైతే ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నారు.

ఇప్పుడీ లిస్ట్ లోకి షారుక్ ,సల్మాన్ లు వచ్చిచేరతారు. కెరియర్ స్టార్టింగ్ లో మల్టీస్టారర్ ఫిలింస్ లో మెరిసిన వీరిద్దరు ..ఆతర్వాత కాలంలో అంతగా కలిసి నటించింది లేదు.జస్ట్ గెస్ట్ అప్పిరియన్స్ తోనే అలా మెరిసి మాయమయ్యేవారు. వెండితెరపై మరోసారి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు కలిసి నటించడమంటే ఫ్యాన్స్ కు అది పెద్ద పండగే.షారూఖ్ సినిమాలో సల్మాన్ కూడా ఉంటారని, ఈ విషయాన్ని షారూఖ్ స్వయంగా ప్రకటిస్తారని అంటున్నారు.

ఇప్పటికే ఈ ఫిలింలో జాన్ అబ్రహామ్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ ఉండగా, ఇప్పుడు మరో సూపర్ స్టార్, సల్మాన్ భాగం కావడంతో, ఇది మెగా మల్టీ స్టారర్ గా మారిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. షారూఖ్ తో ఇంతకుముందు ‘జీరో’లో సల్మాన్ ఓ చిన్న కామిక్ రోల్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ అంతగా కలిసి చేసిన సినిమా లేదు. అయితే అప్పట్లో కరన్ అర్జున్, ‘కుచ్ కుచ్ హోతాహై’, ‘ఓమ్ శాంతి ఓమ్’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ వంటి ఫిలింస్ లో ఇద్దరూ కలిసి నటించారు. ఈ కొత్త సినిమా షూటింగ్ పనులు ఈ నెలలోనే మొదలవుతాయని, న్యూయార్క్ లో సైతం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news