వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్‌

-

వాట్సాప్‌ మరో అద్భుతమైన ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇటీవల వాట్సాప్‌ ప్రైవసీ పాలసీలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనివల్ల కొంత మంది వినియోగదారులు ఇతర యాప్‌లకు మారిపోయారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ మరిన్ని సరికొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లోని చాట్‌ బాక్స్‌ల కలర్స్‌ను మార్చడానికి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే ఇక మీదట వాట్సాప్‌ వినియోగదారులు మెసేజ్‌లను కేవలం బ్లాక్‌ కలర్‌లోనే కాకుండా, బ్లూ, గ్రీన్‌ కలర్‌లోనూ టైప్‌ చేయవచ్చు. దీంతో యూజర్లు తమ వాట్సాప్‌ను రంగురంగులుగా మార్చుకునే అవకాశం దక్కింది. కానీ, ప్రస్తుతం ఈ ఫీచర్‌ కేవలం ఐఓఎస్‌ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది.

 

మొదట వాట్సాప్‌ వెర్షన్‌ 2.21.60.11లో రోల్‌ అవుట్‌ కానున్న ఈ ఫీచర్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై వాట్సాప్‌ ప్రకటించలేదు.

వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్‌ చాలా అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల కూడా ఓ కొత్త ఫీచర్‌ను మొదట బీటా వెర్షన్‌ వినియోగదారులకు పరిచయం చేసింది. దీంట్లో వినియోగదారులు తమ వాయిస్‌ నోట్లను స్పీడ్‌గా ప్లే చేయవచ్చు. ఇది మొత్తం 1x, 1.5x, 2x మూడు– స్పీడ్‌ లెవెల్స్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారులు వచ్చిన వాయిస్‌ మెసేజెస్‌ను వీటిలో ఏదో ఒక స్పీడ్‌తో ప్లే చేసుకునే అవకాశం లభిస్తుంది. కాగా, వాట్సాప్‌ ఇటీవల చాట్‌ థ్రెడ్‌ ఫీచర్‌ను కూడా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సాయంతో వినియోగదారులు ఇకపై తమ సమస్యలను వాట్సాప్‌కు సులభంగా రిపోర్ట్‌ చేయవచ్చు. అంతేకాకుండా కేవలం 48 గంటల్లోనే సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు. ఈ ఫీచర్‌ కూడా ప్రస్తుతానికి కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను అతి త్వరలోనే ఆండ్రాయిడ్‌ వినియోగదారులందరికీ పరిచయం చేయనున్నట్లు వాట్సాప్‌ స్పష్టం చేసింది. బీటా యూజర్లు తమ వాట్సాప్‌ బీటా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా ఈ సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్‌ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version