ఈ ఫ్రూట్స్‌తో ఎముకలు స్ట్రాంగ్.. వీటిని రోజూ తింటే..!

-

మన శరీరంలో ఎముకలు చాలా ముఖ్యభూమికను పోషిస్తాయి. ఎముకలుంటేనే మనిషి యొక్క రూపు రేఖలు సక్రమంగా ఉంటాయి. లేకుండా మనిషి వంకర టింకరగా కనిపిస్తాడు. ఎదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎముక విరిగితే ఎంతో కష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కాళ్లు, చేతులు కూడా ప్రమాదానికి గురికావొచ్చు. అప్పుడు మళ్లీ ఎముకల పునరుద్ధరణ జరగదు. మనిషి నిటారుగా నిలబడాలని అనుకున్నా.. ఎముకలు దృఢంగా, బలంగా ఉండాలి. సరైన పోషకాలు, పండ్లను తీసుకుంటే ఎముకలు స్ట్రాంగ్‌గా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్రూట్స్

పండ్లు – వాటి ఉపయోగాలు..
యాపిల్ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండేందుకు, ఎముకల్లో కణాల ఉత్పత్తికి యాపిల్ ఎంతో తోడ్పడుతుంది. 100 గ్రాముల యాపిల్‌లో విటమిన్-ఏ: 900 ఐయు, విటమిన్-బీ: 0.07 ఎంజీ, విటమిన్-సీ: 5 ఎంజీ, కాల్షియం: 6 ఎంజీ, ఐరన్:3 ఎంజీ, పాస్పరస్: 10 ఎంజీ, పొటాషియం: 130 ఎంజీ, కార్బొహైడ్రేట్స్: 14.9 ఎంజీ పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు 1 యాపిల్ పండును తీసుకుంటే అనేక అనారోగ్య సమస్య నుంచి బయట పడతామని వైద్యులు చెబుతుంటారు.

పైనాపిల్ పండులో పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. ఎండాకాలంలో ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం రోజూ ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తీసుకోవాలి.

స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్-కే, విటమిన్-సీ వంటి పోషకాలు స్ట్రాబెర్రీలో ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకల కణాలను ఉత్పత్తి చేయడానికి తోడ్పడతాయి. ఎండాకాలంలో రోజూ ఒక గ్లాసు స్ట్రాబెరీ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ఇంట్లో విరివిగా దొరికే టమాట పండ్లలో కూడా అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉంచి బలాన్ని చేకూరుస్తాయి. విటమిన్-కే, కాల్షియం, లైకోపిన్ వంటి పోషకాలు టమాటలో పుష్కలంగా ఉంటాయి.

బొప్పాయి పండ్లలో విటమిన్-ఏ, విటమిన్-సీ, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్రూట్‌ని తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా మారడంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version