రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త మోటార్‌ సైకిల్…!

గురువారం నాడు ప్రముఖ మోటార్‌ సైకిల్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్  సరికొత్త మోటారు సైకిల్ ని తీసుకు రావడం జరిగింది. ఎన్‌ఫీల్డ్ హిమాలయాన్‌ అనే పేరుతో దీనిని తీసుకొచ్చారు. ఈ మోటార్‌ సైకిల్ ప్రారంభ ధర రూ. 2.01 లక్షలు గా ఉంది. అయితే ఈ కొత్త మోటార్‌ సైకిల్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే…? ఈ మోటారు సైకిల్ ని వినియోగదారుల ఫీడ్‌ బ్యాక్ ఆధారంగా అప్‌డేట్ చేసారు.

Himalayan Enfield
Himalayan Enfield

ఈ మోటారు సైకిల్ యూకే మార్కెట్ సైతం అందుబాటు లో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది ఇలా ఉండగా అనేక కొత్త అప్‌డేట్స్ తో పాటుగా మూడు కొత్త రంగుల్లో ఇది రానుంది. పైన్ గ్రీన్, మిరాజ్ సిల్వర్, గ్రానైట్ బ్లాక్‌లలో కూడా ఇది లభించనుంది అని కంపెనీ తెలిపింది. ఇది ఇలా ఉండగా మరో విశేషం ఏమిటంటే..? రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్‌ను ఉపయోగించి రైడర్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

టర్న్-బై-టర్న్ నావిగేషన్ ప్యాడ్ ఈ బైకు లో ఉంటుంది. ఈ కొత్త బైక్ లో కొత్త విండ్‌స్క్రీన్, కొత్త ఫ్రంట్ ర్యాక్, బ్యాక్ క్యారియర్ ‌పై అదనపు ప్లేట్స్ కూడా ఉన్నాయి. అలానే రంగులను బట్టి ధరల మధ్య వ్యత్యాసం ఉండనుంది. మిరాజ్ సిల్వర్, గ్రావెల్ గ్రే ధర రూ. 2,36,286 , లేక్ బ్లూ, గ్రానైట్ బ్లాక్, రాక్ రెడ్‌ల ధర రూ. 2,40,285 మరియు పైన్ గ్రీన్ ధర రూ. 2,44,284 గా ఉంది.