రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(వర్క్స్) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొంది టీఎస్పీఎస్సీ.
ఇదిలా ఉంటే.. ఇటీవల రాష్ట్రంలోని రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రిక్రూట్మెంట్ కింద మొత్తం 113 పోస్టులు భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.