సింగరేణి సంస్థ మరో ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకుంది. పర్యావరణ హితంగా సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం 150 గ్రామాలు, పట్టాలణాలకు సేవలు అందిస్తుండటంతో గ్లోబల్ సీఎస్ఆర్ అవార్డు లభించింది. ఈ గ్లోబల్ సీఎస్ఆర్ అవార్డును అంతర్జాతీయ సంస్థ అయిన ఎనర్జీఎన్విరావ్ మెంట్ ఫౌండేషన్ ఇస్తుంది. ఈ అంతర్జాతీయ సంస్థ.. ప్లాటినం కేటగిరిలో సింగరేణి సంస్థ అత్యుత్తమ సీఎస్ఆర్ సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ గ్లోబల్ సీఎస్ఆర్ ఆవార్డును ప్రకటించింది.
కాగ సింగరేణి సంస్థ సోలార్ ప్లాంట్ ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సింగరేణి సంస్థ సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తుంది. అంతే కాకుండా సింగరేణి చుట్టు పక్కల ఉన్న దాదాపు 150 కి పైగా గ్రామాలు, పట్టణాల్లో సింగరేణి సంస్థ సీఎస్ఆర్ కింద సేవలు అందిస్తుంది. కాగ సింగరేణి సంస్థ సీఎస్ఆర్ సేవలు అందించినందకు గాను, సోలార్ ప్లాంట్ లు ఏర్పాటు చేసినందకు గాను ప్రతిష్టాత్మక గ్లోబల్ సీఎస్ఆర్ అవార్డు దక్కింది.