గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై 5 రాష్ట్రాలతో కేంద్రం కీలక భేటీ

-

నదుల అనుసంధానంపై నేడు కేంద్రం కీలక సమావేశం కానుంది. ఢిల్లీలో ఈరోజు గోదావరి- కావేరి నదులన అనుసంధానంపై 5 రాష్ట్రాలలో కేంద్రం సమావేశం జరుగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరుగనుంది. ఈ భేటీకి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక రాష్ట్రాల కారదర్శులు హాజరు కానున్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఈ భేటీకి నేతృత్వం వహించనున్నారు. గోదావరి- కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోనున్నారు. దీని కోసం  సుమారు రూ. 75 వేల కోట్ల వ్యయ అంచనాతో “డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్” ను  జాతీయ జల అభివృద్ధి సంస్థ రూపొందించింది. వృధాగా పోతున్న247 టి.ఎమ్.సి ల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్ట్ లోని మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రం, 10 శాతం ఖర్చు ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. తెలంగాణ సుమారు 80 టి.ఎమ్.సిలు, ఏపి సుమారు 90 టి.ఎమ్.సిలు, పుదుచ్చేరి 5 టి.ఎమ్.సిలు, తమిళనాడు సుమారు 45 టి.ఎమ్.సిలు, కర్నాటక సుమారు 25 టి.ఎమ్.సిలు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్ ను 5 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఉంది. దీనిని గురించి ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో కూడా ప్రస్తావించారు. దీనికి అనుగుణంగానే ఈరోజు ఈ భేటీ జరుగనునుంది.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news