పెట్టుబడి పెట్టాలని అనుకోనేవారికి పోస్టాఫీసు స్కీమ్స్ బెస్ట్ వే..ఇందులో పెట్టుబడి పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు..అందుకే ఈ స్కీమ్ లలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నారు.. ఇప్పటివరకు ఉన్న పథకాలలో గ్రామీణ ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఇప్పుడు తన గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సురక్ష యోజన లేదా గ్రామ సురక్ష పథకాన్ని రూపొందించింది..
ప్రీమియం చెల్లించడానికి కస్టమర్‌కు 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది..ఇకపోతే ఈ పథకం ద్వారా రుణాన్ని కూడా పొందవచ్చు..మూడు సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయడానికి కూడా ఎంచుకోవచ్చు. అయితే, ఆ సందర్భంలో ఎలాంటి గ్రామ సురక్ష యోజన ప్రయోజనాలను పొందలెరు..19 సంవత్సరాల వయస్సులో గ్రామ సురక్ష పాలసీలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే నెలవారీ ప్రీమియం 55 సంవత్సరాలకు రూ.1,515, 58 సంవత్సరాలకు రూ.1,463 మరియు 60 సంవత్సరాలకు రూ.1,411. 55 ఏళ్ల బీమా కోసం మెచ్యూరిటీ ప్రయోజనం రూ. 31.60 లక్షలు కాగా, 58 ఏళ్ల పాలసీకి రూ. 33.40 లక్షలు. 60 ఏళ్ల, 35 లక్షల వరకూ బెనిఫిట్ ను పొందవచ్చు..