యశ్వంత్ సిన్హాను మీరేందుకు కలువరు..? కాంగ్రెస్‌ పై జగ్గారెడ్డి సీరియస్‌

-

యశ్వంత్ సిన్హాను మీరేందుకు కలువరని..కాంగ్రెస్‌ పై జగ్గారెడ్డి సీరియస్‌ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధిష్టానం తో మాట్లాడి సీఎల్పీ కి ఆహ్వానించేది ఉండేనని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు..? అని నిలదీశారు.

యూపీఏలో టీఆరెస్- ఎంఐఎం భాగ్యస్వామ్యం కాకపోయినా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా ని టీఆరెస్ ఆహ్వానించింది..కాంగ్రెస్ పార్టీ, సీఎల్పీ పక్షాన మనం కూడా యశ్వంత్ సిన్హా ని ఆహ్వహించేది ఉండేనని వెల్లడించారు. రాజకీయంగా రెండు పార్టీ లు వేరు వేరు….సిద్ధాంతాపరంగా ,ప్రజా సమస్యల పై సోనియా గాంధీ,రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎప్పుడు బీజేపీ ని ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో లేని టీఆరెస్ ప్రభుత్వనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా ని సీ ఎల్పీ కి పిలిపించి సీఎల్పీ మద్దతు పలికేది ఉండేనని ఫైర్‌ అయ్యారు. దీనిపై పూర్తిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని తప్పు పడుతూ ఢిల్లీ కి లేఖ రాస్తున్నానని ప్రకటన చేశారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version