బర్రెలక్క మరో సంచలన నిర్ణయం.. అక్కడి నుంచి ఎంపీగా….

-

నిరుద్యోగుల సమస్యపై వీడియో చేసి యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో బర్రెలక్కగా స్టేట్ వైడ్‌గా గుర్తింపు వచ్చింది.బర్రెలక్క అలియాస్ శిరీష ప్రయాణమిది.ఇక, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క పేరు మార్మోగింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది.

 

కేసిఆర్ హయాంలో ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలలో మంచి మద్దతు సంపాదించుకుంది.కాగా ఎన్నికల్లో ఆమెకు 5,754 ఓట్లు వచ్చాయి. ఇక, తాజాగా బర్రెలక్కకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి బర్రెలక్క పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.దీనిపై బర్రెలక్క క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక, మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం కి బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బండ్ల గణేష్ ,బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news