పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే..?

-

బంగారం ధరల్లో ప్రతీ రోజు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు భారీగా కనిపించిన ఈ మార్పు ప్రస్తుతం స్వల్పంగా మారింది. బంగారం ధరలో హెచ్చుతగ్గులు స్వల్పంగా దీంతో బంగారం ధర గడిచిన కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం బంగారం ధరలో కాస్త పెరుగుదల కనిపించింది. తులం గోల్డ్‌పై రూ. 10 పెరిగింది. దీంతో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680కి చేరింది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

gold

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,610గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 62,380వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 63,280 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్‌ రూ. 62,680 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 57,460గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,460గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,680గా ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,640, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news