బిగ్‌ బాస్‌ బ్యూటీ సరియుకు మరో షాక్‌..పోలీసులు నోటీసులు జారీ

-

బిగ్‌ బాస్‌ బ్యూటీ, 7 ఆర్ట్స్‌ ఫేం సరియుకు మరో షాక్‌ తగిలింది. బంజారాహిల్స్‌ పోలీసులు.. సరియుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం.. మరో సారి బంజారాహిల్స్ పీఎస్ కి రానుంది యుట్యూబర్ సరియు. మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా ఓ యాడ్ లో నటించింది సరియు. 7 ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో ఈ మధ్య కాలంలోనే రిలీజ్‌ చేసింది.

సరయూ, ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు ఈ వీడియో ఉంది. ఈ నేపథ్యంలోనే.. హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో యుట్యూబ్ నటి సరియుకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. 41A CrPC కింద నోటీసులు ఇచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. 153A, 295A కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు… నిన్న గంటన్నర పాటు విచారణ చేసి.. మరో సారి విచారణ కు రావాలని నోటీసులు జారీచేశారు. దీంతో సరియూ మరోసారి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news