కర్ణాటకలో రాజుకుంటున్న ‘హిజాబ్’ వివాదం…. నేడు హైకోర్ట్ లో విచారణ

-

కర్ణాటకలో ‘ హిబాజ్’ వ్యవహారం రాజుకుంటోంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్కూళ్లు, కాలేజీల్లో తప్పకుండా యూనిఫాం పాటించాలని బస్వరాజ్ బొమ్మై సర్కార్ స్పష్టం చేసింది. అయితే కొంత మంది మాత్రం తమ మతాచారాలకు అనుగుణంగా హిజాబ్ ధరించి స్కూళ్లకు, కాలేజీలకు వస్తున్నారు. దీంతో మరో వర్గం విద్యార్థి, విద్యార్థినిలు కాషాయ కండువాలతో కాలేజీలకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి.. పోటాపోటీగా నినాదాలు, నిరసనలు తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. అయితే ఇలా వచ్చే వారిని స్కూళ్లు, కళాశాల యజమాన్యాలు తరగతులకు అనుమతించడం లేదు. దీంతో గేటుమందే ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ వివాదం మెల్లిగా… బెలగావి, శివమొగ్గ, కొప్పెల ప్రాంతాలకు కూడా పాకింది. 

ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను తరగతులకు అనుమతించాలని కోరుతుండగా.. బీజేపీ ప్రభుత్వం మాత్రం విద్యాలయాల్లో విద్యార్థులంతా సమానమే అంటోంది.

కాగా తాజాగా ఈ వివాదంపై కర్ణాటక హైకోర్ట్ ముందుకు రానుంది. నేడు కర్ణాటక హైకోర్ట్ లో హిజాబ్ వివాదంపై విచారణ జరుగనుంది. దీంతో కోర్ట్ ఎటువంటి తీర్పు వెల్లడిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. కర్ణాటకనే కాకుండా… దేశం కూడా ఈ వ్యవహారంపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news