కాంగ్రెస్ లో చేరిన నేతలకు మరో షాక్.. బీఆర్ఎస్ మళ్లీ ఫిర్యాదు!

-

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మౌనం పాటిస్తుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు మాత్రం గులాబీ పార్టీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే పార్టీ మారిన నేతలపై హైకోర్టు తీర్పు మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద,పాడి కౌశిక్ రెడ్డి కలిశారు.

బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కిషోర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై వేటు వేయాలని అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ ఇచ్చారు. అయితే, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పార్టీ ఫిరాయించిన వారిపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ సెక్రటరీకి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.కాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కిషోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం ఒకింత చర్చకు దారితీసింది.

Read more RELATED
Recommended to you

Latest news