అంకుశంలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పడుతుంది – బండి సంజయ్‌

-

అంకుశంలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పడుతుందని సెటైర్లు పేల్చారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి ఎస్సార్ కన్వెన్షన్ హాలులో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కూన రవి కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.

2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. అంతకుముందు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు వంద శాతం మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యమని చెప్పారు. ఎంఐఎం గోడదూకే పార్టీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు ఒక్కటై పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఎన్నికల్లో గెలుపు మనదే. జీహెచ్ఎంసీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఒవైసీ ఒక్కటై పోటీ చేసినా బీజేపీ ఎదుర్కొవడంతోపాటు గెలిచి తీరుతాం. జీహెచ్ఎంసీ ఎవడి అయ్య జాగీరు కాదు. ఎంఐఎం పార్టీ ఆనవాళ్లు లేకుండా చేస్తాం. తెలంగాణలో ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news