సింగరేణిలో మరో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కాబోతుంది. 800 మెగా వాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం డీపీఆర్ పాలక మండలి శుక్రవారం ఆమోదం తెలిపింది. శుక్రవారం డీపీఆర్ పాలక మండలి హైదరాబాద్ నగరంలో సమావేశం అయింది. థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు ఏర్పాటుతో సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు.. స్థానిక జిల్లాల వారికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగ 800 థర్మల్ విద్యుత్ కేంద్రం మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కాగ మంచిర్యాల జిల్లా జైపూర్ లో ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు ఉంది. ఈ విద్యుత్ ప్లాంట్ ఉన్న ప్రాంగణంలో నే కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా నిర్మించ బోయే థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం రూ. 6,790 కోట్లు అవసరం ఉంటుందని డీపీఆర్ అంచనా వేశారు.
అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో కలిసి మందమర్రి వద్ద మరో 50 వేల టన్నుల పేలుడు పదర్థాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 50 వేల టన్నుల పేలుడు పదర్థాల ఉత్పత్తి కేంద్రం అందుబాటులో ఉంది. దీని సామర్థ్యాన్ని లక్ష టన్నులకు పెంచాలని డీపీఆర్ భావించింది.