అంతర్వేది సాక్ష్యాలు అన్నీ సిబిఐకి ఇచ్చేసాం: ఏపీ పోలీసులు

-

పశ్చిమ గోదావరి జిల్లా అంతర్వేది రధం దగ్ధం కేసును సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏలూరు రేంజ్ డీఐజీ ఎ మోహనరావు మాట్లాడారు. సాంకేతికంగా సేకరించిన సాక్ష్యాధారాలు సీబీఐకి అప్పగిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ కొత్త రధం తయారి కి నిధులు విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు ఛలో అమలాపురం అంటు పిలుపునిస్తున్నాయని చెప్పారు.DIG holds video conference to assess COVID-19 situation in Andhra's Eluru

కోవిడ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 అమలులో ఉన్న నేపధ్యంలో ఆ కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేసారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేసులో అనుమానితులని విచారిస్తున్నామని చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news